Mulugu SIR Enumeration
* 2,36,970 మంది ఓటర్లలో 2,09,128 మంది వివరాల డిజిటలైజేషన్
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ఆకేరు న్యూస్,ములుగు:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం జూన్ 25వ తేదీన ప్రారంభమైందని,తొలి దశలో జూన్ 25 నుంచి జూన్ 30వ తేదీ వరకు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జూలై 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియను ములుగు నియోజకవర్గంలో నూరు శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ములుగు నియోజకవర్గంలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,09,128 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. ఇది మొత్తం ఓటర్లలో 88.25 శాతంగా ఉందని పేర్కొన్నారు.
27,842 మంది ఓటర్లను అన్కలెక్టబుల్గా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 8,354 మంది మరణించిన వారు, 4,015 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నవారు, 14,207 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, 1,219 మంది ఆచూకీ లభించని వారు ఉన్నారని వెల్లడించారు. అన్కలెక్టబుల్గా గుర్తించిన వారి శాతం 11.75 శాతంగా ఉందన్నారు.
డిజిటలైజేషన్ పూర్తయిన 88.25 శాతం, వివిధ కారణాలతో అన్కలెక్టబుల్గా గుర్తించిన 11.75 శాతం కలిపి ములుగు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ పెర్కోన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
