Chepuri Chiranjeevi District Observer
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ చేపూరి చిరంజీవిని వరంగల్ ఉమ్మడి జిల్లా పరిశీలకుడిగా రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా కమిటీల పునర్నిర్మాణం కోసం జిల్లా పార్టీ కోసం పని చేసే ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కోసం నియామకాల పరిశీలకుడిగా చేపూరి చిరంజీవిని నియమించారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చేపూరి చిరంజీవి మాట్లాడుతూ స్థానిక, జిల్లా పాత కమిటీలని సమన్వయం చేసుకుంటూ ఆశావహుల దరఖాస్తు స్వీకరించి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో దరఖాస్తులను రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడికి అందజేస్తానని తెలియజేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
