Karimnagar Kaushik Kamalakar Party Office
* బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల దాడి
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ రణ రంగంగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి బీభత్సం సృష్టించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగానే ఈ దాడి కొనసాగింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగానే దాడి జరిగింది. ఒక్కసారిగా దూసుకువచ్చిన బీజేపీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి వాహనం పై కర్రలు, రాడ్లతో దాడు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఈ విధ్వంసం ఆగ లేదు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను కూడా ధ్వం సం చేశారు. అక్కడే ఉన్న బీఆర్ ఎస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు కలగ జేసుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తంబాకు డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని అందుకే తలపై వెంట్రుకులు ఊడి పోయాయని కౌశిక్ రెడ్డి అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు సిద్దంగా ఉన్నారని అదే విదంగా బండి సంజయ్ కూడా డ్రగ్స్ టెస్ట్‌కు సిద్దంగా ఉండాలన్నారు. ఈ సమాచారం అందుకున్న బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం ..
* నన్ను హత్య చేయడానికే కుట్ర పన్నారు..
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి , బండి సంజయ్‌లు కలిసి కుట్రపన్ని నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడం తప్పవుతుందా అన్నారు. ఎన్నడూ లేని విదంగా ఇటీవలి కాలంలో గన్ కల్చర్ కరీంనగర్లో పెరిగి పోయిందన్నారు. ఇప్పటికే నాపై రెక్కీ నిర్వహించారు. నన్ను చంపడానికి చూస్తున్నారు. ఏకంగా మీడియా సాక్షిగా నాపై దాడి జరిగింది.. అడ్డు వచ్చిన పోలీసుల మీద కూడా దాడి చేశారు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని పాడి కౌశిక్ రెడ్డ డిమాండ్ చేశారు.
————————————
