MLA KR Nagaraju Development Works
* పలు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఆకేరు న్యూస్, హనుమకొండ:
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం ఆయన 56వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని వివేక నగర్, జవహర్ కాలనీ, పరిమళ కాలనీ, శ్రీ సాయి నగర్ కాలనీలలో సుమారు రూ. 3.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత (సిసి) రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి సమస్యను దశలవారీగా పరిష్కరిస్తూ డివిజన్ల రూపురేఖలు మారుస్తామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.
* రూ. 2.5 లక్షల ఆర్థిక సాయం పంపిణీ..
గోపాలపురం జంక్షన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు గతంలో కాలనీవాసులు చేసిన విజ్ఞప్తికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. బుధవారం తన సొంత/అధికారిక నిధుల నుంచి రూ. 2.5 లక్షల చెక్కును కాలనీ ప్రతినిధులకు అందించారు.
ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కందుకూరి పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి దూలం సదానందం, సీనియర్ నాయకులు చింత రమేష్, మర్రి ప్రభాకర్, దూలం పరమేష్, చింతరెడ్డి రవీందర్ రెడ్డి, నలుబాల దామోదర్, చిప్ప ప్రభాకర్, బోనగాని రాంప్రసాద్, రమేష్, మహిళా అధ్యక్షురాలు శనిగరపు అనిత, నాయకురాళ్లు పల్లకొండ సరోజన, గుగులోతు స్వరూప, అన్న విజయ, యూత్ నాయకులు లావుడియా రవి నాయక్, పాలకొండ విజయ్ సూర్య, ఇమ్మడి రాజీవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
