Baby Srinivas Felicitation Event jangaon
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండల మాజీ జడ్పిటిసి బేబీ శ్రీనివాస్ కు స్టేషన్ ఘన్ పూర్ మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మాజీ జడ్పిటిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆమెతో పాటు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య కౌన్సిలర్ సంపత్ రాజ్ లను మోడల్ కాలనీలోని మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
అసోసియేషన్ అధ్యక్షులు ఏదునూరి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బేబి శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు రాజకీయ జన్మనిచ్చిన మోడల్ కాలనీ ఎప్పుడూ మరిచిపోనని ఇదే మోడల్ కాలనీ నుండి జడ్పిటిసిగా ఎన్నికయ్యానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశీస్సులతో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కందికొండ కుమారస్వామి, కార్యదర్శి వెంకటేష్, మాజీ అధ్యక్షులు అక్కనపల్లి అంజయ్య, సంపత్ కుమార్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్ పాషా, రవి, శ్రీనివాస్, సుందర్ సింగ్, మల్లేశం, విజయ్, శ్రీధర్, కుమారస్వామి, కౌశిక్ నరసయ్య లతోపాటు కమిటీ సభ్యులు కాలనీవాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
