Rayaparthy ration dealers demands
* ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడండి..
— రేషన్ డీలర్ల సమస్యలపై ముఖ్యమంత్రికి, మంత్రి శ్రీధర్ బాబుకు రాయపర్తి మండల రేషన్ డీలర్ల సంఘం విజ్ఞప్తి
ఆకేరు న్యూస్,రాయపర్తి:
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని రాయపర్తి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఎనగందుల ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆయన ఒక వినతిపత్రం గురించిన వివరాలను పత్రికాముఖంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎనగందుల ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ డీలర్లకు నెలకు ₹5,000 గౌరవ వేతనం మరియు కమిషన్ ఇస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆ హామీని అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు మంత్రులను, అధికారులను కలిసి విన్నవించినప్పటికీ “రేపు, మాపు” అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆచరణలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రేషన్ డీలర్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బియ్యం పంపిణీ సమయంలో సర్వర్ సమస్యలు (Server Down) తలెత్తడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు లబ్ధిదారులు, డీలర్లు గంటల తరబడి కాచిరచూడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అన్నారు.
మేము ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ కోరడం లేదని, ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఒప్పకున్న హామీలను మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీలర్లకు ఇస్తానన్న ₹5,000 గౌరవ వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలని, అలాగే సర్వర్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి రేషన్ డీలర్ల సంక్షేమాన్ని కాపాడాలని ఎనగందుల ఉపేందర్ విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
