Bhatti Vikramarka jangaon visit Road Repairs
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాక కోసం జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట ప్రధాన రోడ్డును మరమ్మతు చేస్తున్నారు. పలగుట్టలో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈనెల 7వ తేదీన రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటన తదుపరి తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈలోగా వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పై పల్లగుట్ట క్రాస్ రోడ్డు నుండి పల్లగుట్ట వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను ఇప్పటికే తొలగించారు. గుంతలుగా ఉన్న రోడ్డును మరమ్మత్తు చేసేందుకు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి గుంతలు పూడుచుతున్నారు. ఈ రోడ్డు మరమ్మతు పనులను పల్లగుట్ట సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, కారోబార్ జీడి ఆనందంలో చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రోడ్డు గుంతలు పూడ్చడం, రోడ్డుకి ఇరువైపున చెట్లను తొలగించడం పట్ల వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
