* జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయింపు
* ముగ్గురు మహిళలకు చోటు
* పెండింగ్‌లో ఒక స్థానం.. అది ఎవరికి?
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీం రెడీ అయింది. కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనుంది. 26 మందికి 25 మందితో కేబినెట్ ను సిద్దం చేశారు చంద్రబాబునాయుడు. తన టీమ్‌లో కూటమి పార్టీలు జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి మంత్రి పదవులు కేటాయించారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. చంద్రబాబు సహా 24 మంది మంత్రులు 11.27 గంటల నుంచి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంచనాలకు భిన్నంగా మంత్రులు ఎంపికలో చంద్రబాబు తన మార్కు చూపించారు. కాపు సామాజికవర్గం నుంచి 12 మందికి, బీసీలు 8 మందికి, ఎస్సీ-2, ఎస్టీ-1, మైనార్టీ, వైశ్య సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి చాన్స్ కల్పించారు. కాగా, చంద్రబాబు ఒక స్థానం పెండింగ్‌లో ఉంచారు. ఆ స్థానం ఎవరికి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
జనసేన నుంచి..
– పవన్ కళ్యాణ్ (పిఠాపురం నియోజకవర్గం, కాపు)
– నాదెండ్ల మనోహర్ (తెనాలి నియోజకవర్గం, కమ్మ)
– కందుల దుర్గేష్ (నిడదవోలు నియోజకవర్గం, కాపు)
– బీజేపీ నుంచి సత్య కుమార్ (ధర్మవరం నియోజకవర్గం, బీసీ)
తెలుగుదేశం నుంచి
– నారా లోకేష్ (మంగళగిరి నియోజకవర్గం, కమ్మ)
– కింజరాపు అచ్చం నాయుడు (టెక్కలి నియోజకవర్గం, బీసీ)
– కొల్లు రవీంద్ర (మచిలీపట్నం నియోజకవర్గం, బీసీ)
– పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ నియోజకవర్గం, కాపు)
– వంగలపూడి అనిత (పాయకరావుపేట, ఎస్సీ మాదిగ)
– నిమ్మల రామానాయుడు (పాలకొల్లు నియోజకవర్గం, కాపు)
– ఎన్ ఎండి ఫరూఖ్ ( నంద్యాల నియోజకవర్గం, ముస్లిం మైనార్టీ)
– ఆనం రామనారాయణ రెడ్డి (నెల్లూరు నియోజకవర్గం, రెడ్డి)
– పయ్యావుల కేశవ్ (ఉరవకొండ నియోజకవర్గం, కమ్మ)
– అనగాని సత్యప్రసాద్ (రేపల్లె నియోజకవర్గం, బీసీ)
– కొలుసు పార్థసారథి (నూజివీడు నియోజకవర్గం, బీసీ)
– బాల వీరాంజనేయ స్వామి (కొండపి నియోజకవర్గం, ఎస్సీ)
– గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి నియోజకవర్గం, ఓసీ)
– గుమ్మడి సంధ్యారాణి (సాలూరు నియోజకవర్గం, ఎస్టీ)
– జనార్దన్ రెడ్డి (బనగానపల్లె నియోజకవర్గం, రెడ్డి)
– టీజీ భరత్ (కర్నూలు నియోజకవర్గం, ఓసీ)
– సవిత (పెనుకొండ నియోజకవర్గం,)
– వాసంశెట్టి సుభాష్ (రామచంద్రపురం నియోజకవర్గం, బీసీ)
– కొండపల్లి శ్రీనివాస్ (గజపతి నగరం నియోజకవర్గం, బీసీ)
– మందపల్లి రాంప్రసాద్ (రాయచోటి నియోజకవర్గం, రెడ్డి)
—————————-