West Bengal Assembly Dissolution by Governor RN Ravi
* గవర్నర్ ఆర్.ఎన్. రవి సంచలన నిర్ణయం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఈ రోజు నుంచి అమలులోకి వచ్చేలా ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 కల్పించిన అధికారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజారిటీని దక్కించుకోవడం, ప్రస్తుత అసెంబ్లీ గడువు తీరడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉండటంతో ఈ సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గవర్నర్ నిర్ణయంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన ముగియగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
త్వరలోనే బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిందని, మమతా బెనర్జీ శకం ముగిసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
