Telangana Grameena Bank Services thatikonda jangaon
* వాణిజ్య బ్యాంకులకు ధీటుగా గ్రామీణ బ్యాంకు సేవలు
… గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా గ్రామీణ బ్యాంకు సేవలు ఖాతా దారులకు అందిస్తున్నామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 939 శాఖల ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామన్నారు. మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటికొండకు చుట్టుపక్కల జిట్టా గూడెం, గాలి గుట్ట, జిబి తండ, కృష్ణాజి గూడెం, గార్లగడ్డ, ఫతేపూర్ తదితర గ్రామాలకు కేంద్రంగా ఉందని ఇక్కడ బ్యాంకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు, బ్యాంకు ఖాతాదారులు మండల కేంద్రానికి వెళ్లకుండా స్థానికంగానే బ్యాంకు సేవలు అందుకోవచ్చు అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మా బ్యాంకు ద్వారా సేవింగ్, కరెంట్ అకౌంట్స్ తోపాటు హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఫ్లాట్ కొనుగోలు, గృహ కొనుగోలు, బంగారంపై రుణాలు, వ్యవసాయ సంబంధ రుణాలు అందిస్తామన్నారు. వీటితోపాటు 20 లక్షల వరకు ముద్ర రుణాలు కూడా ఇస్తామన్నారు. ఇతర వాణిజ్య బ్యాంకుల తరహాలో డిజిటల్ సేవలు అందిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 150 కోట్ల లావాదేవీలు నిర్వహించామని ఆయన తెలిపారు. మహిళలు, రైతులు, ఖాతాదారులు గ్రామీణ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గ్రామీణ తెలంగాణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఉదయ్, చీఫ్ మేనేజర్ సుదేశ్ రెడ్డి, సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ మురళి, బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబు, క్యాషియర్ శ్రీకాంత్ రెడ్డి, మెసెంజర్లు శ్రీనివాస్, రవి చందర్, మండల మాజీ వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి, సర్పంచ్ మారపాక సృజన శ్రీనివాస్, గ్రామ పెద్దలు రాపోలు మధుసూదన్, ఉప సర్పంచ్ ఎడమ కట్టమల్లు వార్డు సభ్యులు వైయస్ ఏలియా, బొల్లం నాగరాజు, పెరబోయిన కుమార్, నలిమేల కోమలత-ఏలియా, దుబ్బాక నవ్య-నాగరాజు, జిట్టగూడెం సర్పంచ్ బానోతు బాలు గార్లగడ్డ తండా సర్పంచ్ నవీన్, కృష్ణాజి గూడెం సర్పంచ్ మల్లం రవీందర్ ఉప సర్పంచ్ రవీందర్, ఫతేపూర్ సర్పంచి లక్ష్మి, హై స్కూల్ చైర్మన్ బేతి మంజులా, మహిళా సంఘాలు మాజీ ప్రజా ప్రతినిధులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
