Justice Gunda Chandrayya Death
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన వారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మానవహక్కుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య ( 72 ) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్హెచ్ఆర్సి) తొలి ఛైర్మన్గా డిసెంబర్ 2019లో నియమితులయ్యారు.
సామాజిక అసమానతలు, వివక్ష మరియు మానవ హక్కుల ఉల్లంఘనలు వంటి సమస్యలపై దృష్టి సారించారు, తరచుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ప్రముఖంగా ప్రస్తావించేవారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాప్రూర్ గ్రామానికి చెందిన వారు. ప్రాథమిక విద్యాబ్యాసం నుంచి డిగ్రీ వరకు ఆదిలాబాద్ జిల్లాలో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎల్ ఎల్ బీ, ఎల్ ఎల్ ఎం కోర్సులను పూర్తి చేశారు. వీటితో పాటు పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ పట్టా పొందారు. సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.
————————————-
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
