CPM Fuel Price Protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కృష్ణాజి గూడెంలో దహనం చేశారు. సిపిఎం రాష్ట్ర కమీటి పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మండల కార్యదర్శి సాదం రమేష్ ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు ₹3, సీఎన్జీపై కిలోకు ₹2 పెంపు ప్రజలపై తీవ్ర భారం అన్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, స్తంభించిన వేతనాలతో సతమతమవుతున్న శ్రామిక ప్రజలపై ధరల పెంపు మరింత భారం అన్నారు. అండర్-రికవరీ అనేది తప్పుడు పదం. ఓఎంసీలకు నిజమైన నష్టాలు లేవు, క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు అవే కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి. మరింత పెంచి ఉంటే వచ్చే లాభాలకు, ఇప్పటి రాబడులకు మధ్య ఊహాజనిత లోటు మాత్రమే ఇది అన్నారు. మోదీ సర్కార్ దోపిడీకి పాల్పడుతుందని క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు లాభాలు ప్రజలకు పంచలేదు. ఇప్పుడు ధరలు హెచ్చుతగ్గులకు లోనవగానే ప్రభుత్వం భారం సామాన్యులపైకి నేడుతుందన్నారు. నెడుతున్నారు. రవాణా ఖర్చు పెరగడం వల్ల కూరగాయలు, బియ్యం, పప్పులు, వ్యవసాయ ఉత్పాదకాలు, ప్రాథమిక సేవల ధరలు అన్నీ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ ప్రకటనను ఆలస్యం చేసిందని ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించకుంటే చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పెట్రోల్ బంకుల ఎదుట, బస్టాండ్ దగ్గర నిరసనలు చేస్తాం. ఆటో డ్రైవర్లు, రైతులు, కూలీలను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పోలు సంపత్, మండల కమీటి సభ్యులు సాదం శ్రీనివాస్, నాయకులు సాదం పరమేష్, వార్డు మెంబర్ ఊరడి బుచ్చి రాజ్, నారబోయన బిక్షపతి, పోలు శ్రీనివాస్, ముడిక బీమయ్య, ఉరడి లింగయ్య, ఉరడి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

1 thought on “PETROL PRICE |పెంచిన పెట్రోలు ధరలు తగ్గించాలి: సిపిఎం డిమాండ్”