Census Awareness Rally Telangana MLA KR NAGARAJU
*ఖచ్చితమైన జనగణనతోనే అభివృద్ధికి బలమైన పునాది
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరాలంటే జనాభా గణన (Census) అత్యంత కీలకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అన్నారు.
వర్ధన్నపేట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన జనగణన అవగాహన ర్యాలీలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనాభా గణన దేశ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ముఖ్య కార్యక్రమమని తెలిపారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి, గృహ నిర్మాణం వంటి రంగాల్లో మెరుగైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు.
జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించి సరైన వివరాలు ఇవ్వాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ప్రణాళికలు విజయవంతమవుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
