Jubilee Hills Movie Offer Assault
* జూబ్లీహిల్స్ పరిధిలో ఘోరం..
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
సినీ రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌లో సినిమా అవకాశాల పేరుతో అమాయక యువతులను వేధించే ముఠాలు మరోసారి రెచ్చిపోయాయి. వెండితెరపై మెరవాలనే ఆశను ఆసరాగా చేసుకుని, ఓ అనాథ యువతిపై కొందరు మృగాలు నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఘోర ఉదంతం నగరంలో కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నమ్మించి మోసం చేసారు… జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఇద్దరు అనాథ యువతులతో కొందరు యువకులు పరిచయం పెంచుకున్నారు. తాము సినిమా ఇండస్ట్రీలో ఉన్నామని, షూటింగ్లలో మంచి అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి మాటలను నిజమేనని నమ్మిన యువతుల్లో ఒకరిని నిందితులు వ్యూహాత్మకంగా ట్రాప్ చేశారు.
* గదిలో బంధించి ఘాతుకం..
బాధితురాలిని నిందితులు సికింద్రాబాద్‌లోని ఒక రహస్య గదికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై రెండు రోజుల పాటు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఎంత ప్రతిఘటించినా వదలకుండా హింసించారు. ఆ తర్వాత ఈ నెల 16న (శనివారం) ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఓ ర్యాపిడో (Rapido) బైక్‌ను బుక్ చేసి, ఆమెను తిరిగి జూబ్లీహిల్స్‌కు పంపించిేశారు.
* పోలీసుల దర్యాప్తు…
నిందితుల దాడి కారణంగా యువతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. నరకం అనుభవించిన సదరు బాధితురాలు ధైర్యం చేసి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన ఘాతుకాన్ని వివరిస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తక్షణమే రంగంలోకి దిగారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సికింద్రాబాద్‌లోని ప్రాంతాన్ని, నిందితులను గుర్తించేందుకు పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. సినిమా ఇండస్ట్రీ పేరుతో వచ్చే ఇలాంటి నకిలీ అవకాశాల పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
