Sundarayya Memorial CPM Meeting
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
సుందరయ్య పోరాట స్ఫూర్తితో ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభను మంగళవారం మండల కేంద్రంలో ఇప్పగూడెం, కృష్ణాజి గూడెం, లింగంపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు రాపర్తి రాజు, ఇర్రి అహల్య మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పుచ్చలపల్లి సుందరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలన, వెట్టి చాకిరి, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సుందరయ్య సమర్థ నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి చిలుముల్ల భాస్కర్ పోలాసు పరమేష్, రంగరాయిగూడెం ఉప సర్పంచ్ మునిగే నరసింహులు, ఇప్పగూడెం ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు, వంగపండ్ల సోమయ్య, రాంరెడ్డి, కొమురయ్య గోడిశాల యాదగిరి, సట్ల రాజు, దైద కుమార్, కరుణాకర్ లింగనబోయిన కుమార్, మంద మొగిలి, లింగనబోయిన శ్రీకాంత్, కాసాని రమేష్, అన్నెపు రాజు తదితరులు పాల్గొన్నారు.
* చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో “కమ్యూనిస్టు గాంధీ”, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
మండల కార్యదర్శి సాదం రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఊరడి బుచ్చిరాజ్, సీనియర్ నాయకులు సాదం పరమేష్, నారబోయన బిక్షపతి, ఊరడి రవి, ముడిక బీమయ్య, సాదం రామరాజు తదితరులు పాల్గొని సుందరయ్యకి జోహార్లు అర్పించారు.
