Warangal Women Police Station Shift
* మహిళా పోలీస్ స్టేషన్ల పరస్పరం మార్పు
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లు మారాయి. గతంలో ఉన్న అడ్రస్ల్లో కాకుండా వేరే ప్రాంతాలకు స్థాన చలనం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ల భవనాలలో ఈ నెల 21నుంచి స్థాన చలనం జరగనుంది. పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వివిధ జిల్లాల నుండి వచ్చే బాధితులకు సేవలని మరింత సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 21వ తేదీ నుండి ఈ నూతన మార్పులు అవుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
* సుబేదారి లో మహిళా పోలీస్ స్టేషన్ – 1
.హనుమకొండ జిల్లా పరిధిలోని ప్రజలకు సేవలందించే మహిళా పోలీస్ స్టేషన్ -01 (WPS-1) ప్రస్తుతం రంగంపేటలోని ఎండోమెంట్ ఆఫీస్ వెనుక పాత సెంట్రల్ జైల్ ఎదురుగా ఉన్న భవనంలో కొనసాగుతోంది. ఈ పోలీస్ స్టేషన్ ఈ నెల 21నుంచి సుబేదారి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పై అంతస్తులోకి పూర్తిగా మార్చనున్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ భార్యాభర్తల వివాదాలు, కుటుంబ సమస్యల పరిష్కారం లేదా కౌన్సిలింగ్ సేవల కోసం సుబేదారి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ 01 మాత్రమే సంప్రదించాలి.
* రంగంపేట కు మహిళా పోలీస్ స్టేషన్ -02
వరంగల్ , జనగామ జిల్లాల పరిధిలోని ప్రజలకు సేవలందించే మహిళా పోలీస్ స్టేషన్ -2 (WPS-2) ప్రస్తుతం సుబేదారి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పై అంతస్తులో నడుస్తోంది. దీనిని ఈ నెల 21 నుంచి రంగంపేటలో ఉన్న పాత సెంట్రల్ జైలు ఎదురుగా (ఎండోమెంట్ ఆఫీస్ వెనుక) గల భవనంలోకి, అంటే ప్రస్తుతం డబ్ల్యూపీఎస్-1 ఉన్న స్థానంలోలోకి మార్చడం జరుగుతుంది. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన బాధితులు తమ భార్యాభర్తల సమస్యల పరిష్కారం కోసం మే 21వ తేదీ నుంచి రంగంపేటలోని పాత సెంట్రల్ జైలు ఎదురుగా నూతనంగా అందుబాటులోకి వచ్చే డబ్ల్యూపీఎస్-2 పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాల్సి ఉంటుంది.
————————————————–
