Palakurthi Mega Job Mela
* యువతకు ఝాన్సీ రెడ్డి పిలుపు
ఆకేరు న్యూస్ ,పాలకుర్తి : మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి కళ్యాణ మండపంలో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జాబ్ మేళాను ప్రారంభించారు. ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం నిరుద్యోగులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు .
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రైవేట్ రంగంలో మంచి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించాయన్నారు . 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుంచే యువత కళ్యాణ మండపానికి భారీగా చేరుకొని తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
జాబ్ మేళా ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటీర్లు సహాయం అందించారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు మా ట్రస్ట్ తరపున భవిష్యత్తులో కూడా మరిన్ని ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ట్రస్ట్ సభ్యులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
——
Please tell us what is wrong. Your report will be sent to the website team.
