Old Man Heatstroke Death Katrapalli
* మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన స్థానికులు…
ఆకేరు న్యూస్ రాయపర్తి:- హైదరాబాద్ నుండి కూతురు ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చిన ఓ వ్యక్తి వాంతులు విరోచనాలతో శుక్రవారం ఉదయం మృతి చెందిన ఘటన మండలంలోని కాట్రపల్లి గ్రామములో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామానికి చెందిన ఎండి యాకుబ్ (66) హైదరాబాద్ లో ఉన్న తన చిన్న కుమారుని వద్దకు వెళ్లి రెండు రోజుల క్రితం రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన తన కూతురు ఇమాంబిని చూసి పోదామని కాట్రపల్లికి చేరుకున్నాడు.
చేరుకున్న కొన్ని గంటల్లోనే ప్రయాణంలో తగిలిన ఎండ వేడికి వాంతులు, విరోచనాలు మొదలై తీవ్రమైన అస్వస్థతకు గురై సోమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రి కి చికిత్స కోసం తరలించే సమయం లో యాకుబ్ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని స్థానికులు యాకుబ్ స్వగ్రామం అయినా ఏడునుతులకు తరలించారు. మృతునికి ఏడాది క్రితం భార్య వహిదున్నిసా గుండె పోటుతో మృతి చెందింది.
నిరుపేద కుటుంబానికి చెందిన యాకుబ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
——————————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
