Station Ghanpur Telugu Culture Promotion
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటాలని చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లుట్ల ఫౌండేషన్ కళాపీఠం ఆధ్వర్యంలో ‘శ్రీకృష్ణ రాయబారం’ పద్యనాటక ప్రదర్శన అత్యంత అద్భుతంగా జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుపతి వెంకటకవుల అమూల్య సాహిత్య సంపదను నేటి తరానికి చేరువ చేసే కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరం అన్నారు. నాటకంలోని పద్యాలు, నటీనటుల అభినయం, సంగీతం ప్రేక్షకులను అలరించడమే కాకుండా ధర్మం, నీతి, సంస్కృతి విలువలను గుర్తు చేశాయని అభిప్రాయపడ్డారు. తెలుగు పద్యనాటక కళారూపాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తున్న నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీందర్ రావుని అభినందించారు.
ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం ద్వారా యువతకు మన సాహిత్య వారసత్వం పరిచయం అవుతుం దని. భవిష్యత్తులో కూడా మరిన్ని గొప్ప కళా కార్యక్రమాలను నిర్వహించి తెలుగు సంస్కృతి వైభవాన్ని చాటాలని ఆకాంక్షిస్తున్నాను.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
