Hyderabad Cricket Betting Racket
* హైదరాబాద్‌లో వేల కోట్ల దందా
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమంగా సాగుతున్న అంతరాష్ట్ర క్రికెట్ బెట్టింగ్, హవాలా సామ్రాజ్యంపై తెలంగాణ సీఐడీ (CID Telangana) పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించి, ఆన్లైన్ బెట్టింగ్‌ల పేరిట అమాయకుల నుంచి వందల కోట్లు గుంజుతూ, వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న ఒక భారీ ముఠాను అధికారులు విజయవంతంగా బస్టు చేశారు.
విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి, ఇప్పటివరకు ఈ ముఠాకు చెందిన 13 మంది కీలక సభ్యులను అరెస్ట్ చేశాయి.
* డిజిటల్ తెరవెనుక ‘వేల కోట్ల’ హవాలా దందా…
పక్కా ప్లాన్ ప్రకారం సాంకేతికతను వాడుకుంటూ ఈ ముఠా సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఐపీఎల్ సహా పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో పంటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్, క్లోజ్డ్ వెబ్సైట్లను వీరు ఉపయోగించారు.
* ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల మాయాజాలం..
ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహణ. లూప్‌హోల్స్ ఉపయోగించి వేర్వేరు వ్యక్తుల పేర్లతో వందలాది ‘కరెంట్, సేవింగ్స్’ ఖాతాలను తెరిచి నిధుల మళ్లింపు.
హవాలా లింకులు: బెట్టింగ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా దేశ విదేశాలకు చేరవేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
కీలక సమాచారం: ఈ ముఠా లావాదేవీల విలువ రూ. వేల కోట్లలో ఉంటుందని, ప్రధాన సూత్రధారులు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
* దర్యాప్తు ముమ్మరం.. మరిన్ని అరెస్టులకు అవకాశం.
ప్రస్తుతం అరెస్ట్ అయిన 13 మంది నిందితుల నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, కమ్యూనికేషన్ డివైజెస్ మరియు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిన సీఐడీ, వాటిలోని నిధుల ప్రవాహాన్ని (Fund Flow) నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఏ ఏ అంతర్జాతీయ లింకులు ఉన్నాయి? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
