ACP Bheem Sharma Advice
* విద్యార్థు లక్ష్యాలను చేరుకోవాలి
.. ఏసీపీ బీమ్ శర్మ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువులను అభ్యసించి లక్ష్యాలను చేరుకోవాలని స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి భీమ్ శర్మ సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివునిపల్లి హాని కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళిక బద్దంగా చదువుకొని లక్ష్యం చేరుకోవాలన్నారు. హాని కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నీల రాకేష్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఏసిపి సర్టిఫికెట్స్ అందించారు. కార్యక్రమంలో హనీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నీల వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ట్రయినర్స్ సంధ్య, చందర్, ప్రముఖులు కట్ల సదానందం, మేకల మల్లేశం, నీల సమ్మయ్య, బూర్ల ఉప్పలయ్య, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
