BJP Leaders Mana Badi Mana Badhyata, Kamalapur
* ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపే లక్ష్యం
* ఈ నెల 13న పాఠశాలల క్లీనింగ్, 16న గ్రామగ్రామాన ర్యాలీ
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏండ్ల పదవీకాలం పూర్తైన సందర్భంగా, కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపుమేరకు బీజేపీ శ్రేణులు మనబడి మన బాధ్యత కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాయి. మండలంలోని భీంపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి, వాటిని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ, తల్లిదండ్రులందరూ ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే వారి పిల్లలను చేర్పించాలని కోరారు.
పాఠశాలల పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని ఈ నెల 13న పాఠశాలలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే, ఈ నెల 16న ప్రభుత్వ పాఠశాలల్లో మండల వ్యాప్తంగా విద్యార్థుల అడ్మిషన్లను ప్రోత్సహించేలా ప్రతి గ్రామంలో ర్యాలీలు చేపట్టనున్నట్టు తెలిపారు.
గతంలో మోడీ కానుక పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మంత్రి బండి సంజయ్ కుమార్ సైకిళ్లను పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల 20,000 సైకిళ్లను మంత్రి బండి సంజయ్ కుమార్ పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
