NABARD Jangaon Office
* ‘నాబార్డ్’ సేవలు జిల్లాలో విస్తరించాలి
* నాబార్డ్ సిజిఎం ఉదయ్ భాస్కర్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి, నాబార్డ్ సేవలు మరింత విస్తరించాలని, ప్రజలకు మరింత చేరువ చేయడానికి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు సీజీఎం ఉదయభాస్కర్ అన్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో శనివారం నాబార్డ్ నూతన జిల్లా అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి, నాబార్డ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి పశుల విజయ్ కుమార్ ని నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారిగా జనగామ జిల్లాకు నియమించినట్లు తెలిపారు.
బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, గ్రామీణాభివృద్ధికి ఊతమివ్వడం, రైతులు, స్వచ్ఛంద సంస్థలు బ్యాంకింగ్ రంగానికి అవసరమైన సహకారం అందించడం నాబార్డ్ ప్రధాన లక్ష్యమని వివరించారు. గ్రామాల అభివృద్ధి, జీవనోపాధి అవకాశాల పెంపు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.
ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు బ్యాంకింగ్ వ్యవస్థకు అన్నివిధాలా నాబార్డ్ సహకారం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం సత్యనారాయణ మూర్తి, డీఆర్డీఏ నూర్ ఉద్దీన్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ ఉదయ్ ముక్తాపురం, వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యనిర్వాహణ అధికారి వజీర్ సుల్తాన్, మారి సంస్థ డైరెక్టర్ జయరామారావు, వెంకట్, సిరి-శ్రీనివాస్, కొమురయ్య, స్పందన సంస్థ సోమయ్య, శాంతి సంస్థ సుధాకర్ హాజరయ్యారు.
