CPI MLA Kunamneni Sambasiva Rao Venkatapur Visit
* గతంలో అసెంబ్లీలో ప్రస్తావించిన కూనం నేని
* మనోజ్ రెడ్డి భూ భాగోతాన్ని వెలికి తీసిన ఆకేరు న్యూస్
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు రేపు ( మంగళవారం ) హనుమకొండకు రానున్నారు. కాజీపేట , గుండ్ల సింగారం ప్రాంతాల్లో జరిగే సీపీఐ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అయినవోలు మండలం వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శిస్తారని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తెలిపారు.
* కట్టా మనోజ్ రెడ్డి ఆక్రమిత భూముల పరిశీలన
కాంగ్రెస్ పార్టీ నేత కట్టా మనోజ్ రెడ్డి వెంకటాపూర్ గ్రామంలో పేదల భూములను ఆక్రమించిన విషయం తెలిసిందే.. గత పిబ్రవరి 28 తేదీన ఆకేరు న్యూస్ చానల్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 1994 లో అప్పటి ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైండ్ భూములను కట్టా మనోజ్ రెడ్డి ఆక్రమించినట్టు ఆధారాలు సైతం అందించింది. అయినప్పటికీ రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో సీపీఐ పార్టీ అద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరికి తోడుగా ఎంఆర్పీఎస్ నాయకులు సైతం ఆందోళనలు చేశారు. మార్చి 24 తేదీన సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరాలు అసెంబ్లీలో కట్టా మనోజ్ రెడ్డి భూ భాగోతాన్ని ప్రశ్నించారు.
వెంటనే ప్రభుత్వం స్పందించి మనోజ్ రెడ్డి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవిన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అయినవోలు తాహసిల్దార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి పంపించామని చెబుతున్నారు. నివేదికలో దాగున్న విషయాలను మాత్రం ప్రజలకు తెలియ జేయడం లేదు. దీంతో భూ స్వామి కట్టా మనోజ్ రెడ్డి తో రెవిన్యూ అధికారులు కుమ్మక్కయినట్లుగా అనుమానాలు ఉన్నాయని సీపీఐ నాయకులు అంటున్నారు. సీపీఐ నేత పర్యటనతో మనోజ్ రెడ్డి భూ భాగోతానికి తెర పడే అవకాశం ఉన్నట్లుగా సీపీఐ శ్రేణులు భావిస్తున్నాయి.
——————————————–
