Peddavangara Press Club
* ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం
* జర్నలిస్టుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ
ఆకేరు న్యూస్,పెద్దవంగర:
పెద్దవంగర ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు దుర్సోజు రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా రంగు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా సుంకరి ఓంకార్, ఉపాధ్యక్షుడిగా చట్టు యాకన్న, కోశాధికారిగా బారీ విక్రమ్, కార్యదర్శులుగా జాటోత్ దామోదర్, జాటోత్ సుధాకర్, ఓరిగంటి సైదులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు దుర్సోజు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి సుంకరి ఓంకార్ మాట్లాడుతూ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి జాప్యం లేకుండా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు.
ప్రెస్ క్లబ్ అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన విలువల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. యువ జర్నలిస్టులకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ, సభ్యులందరినీ కలుపుకొని ప్రెస్ క్లబ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామని వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
