Kadiyam Srihari Development Works
* గ్రామాలలో సమస్యలను పరిష్కరిస్తా
* సీఎం సహకారంతో అభివృద్ధి – ఎమ్మెల్యే కడియం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
కరువు పరిస్థితులు ఏర్పడిన గోదావరి జలాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (జీ)లో హెల్త్ సెంటర్, సీసీ కెమెరాలు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా స్వయం ఉపాధి కూరగాయల నమూనా షెడ్డు, సీసీ రోడ్స్, వైకుంఠ రథం, రచ్చబండ మొదలైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం ప్రారంభించారు. అనంతరం తీగారంలో ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్ల, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
తమ్మడపల్లి (జీ)లో పదవ తరగతి మండల టాపర్ గా బాసరలో సిటు సాధించిన గాదె శ్రీజ అభినందించి 10 వేల రూపాయల బహుమతి ప్రకటించారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను, కరాటేలో డాక్టరేట్ సాధించిన క్రీడాకారులను శాలువాతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు.
* ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తమ్మడపల్లి (జీ) తీగారం గ్రామాలను అభివృద్ధి చెందిన గ్రామాల సరసన నిలిపే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. తమ్మడపల్లి (జీ) గ్రామానికి బిటీ రోడ్డు వచ్చిందన్న, పాఠశాల హై స్కూల్ గా అప్ గ్రేడ్ అయిందన్నా, సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయన్న కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వచ్చాయని తెలిపారు.
2004 నుండి 2023 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీ అందరికీ తెలుసని అన్నారు. తమ్మడపల్లి జీ గ్రామానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క తమ్మడపల్లి జీలోనే 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని, అలాగే 32 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 20 లక్షల సిసి రోడ్లు మంజూరు చేశానని నెల రోజుల్లో మరో 30 లక్షల సిసి రోడ్లు మంజూరు చేస్తానని అలాగే మరో 6 నెలలలో మరొక 50 లక్షల సిసి రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

వరంగల్ నుండి తమ్మడపల్లి మీదుగా జనగామ వరకు బస్సు సర్వీస్ త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన అభివృద్ధి పనులు జరుగుతున్న కొంత మంది తల తోక లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది, ప్రస్తుతం నా పని తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలని సూచించారు. నిజాయితీగా పని చేసేవాళ్లను, పనులు, పథకాలు, పదవులు అమ్ముకున్న వాళ్ళను ఒకేలా చూడవద్దని అన్నారు. నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి దగ్గర అయినా పనులు ఇస్తాననో, పదవులు ఇస్తాననో, పథకాలు ఇస్తాననో ఒక్క రూపాయి తీసుకున్న ఇక్కడే నా పదవికి రాజీనామా చేసే వెళ్ళిపోతానని సవాల్ చేశారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అత్యధికంగా 1400 కొట్ల నిధులు మంజూరు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరువుతో వలస వెళ్లిన నియోజకవర్గం నేడు దేవాదుల ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక వరి, మొక్కజొన్న దిగుబడి సాధించిన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అని తెలిపారు. వచ్చే వర్షాకాలం వరకు ప్యాకేజీ -6 పనులు పూర్తి చేయించి తమ్మడపల్లికి గోదావరి జలాలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
తీగారం గ్రామానికి 5 వైపులా బిటీ రోడ్లు వేసింది కడియం శ్రీహరి అని తీగారం గ్రామంలో ఏ అభివృద్ధి జరిగిన అది కడియం శ్రీహరి ద్వారానే జరిగిందని వెల్లడించారు. తీగారం గ్రామంలో ఇప్పటి వరకు కోటి 75 లక్షలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని తెలిపారు. కాలువలలో పూడిక తీసి తీగారం గ్రామ రైతులకు సాగు నీరు అందించినట్లు త్వరలోనే కాలువకు సిసి లైనింగ్ పూర్తి చేసి పూర్తిస్థాయిలో సాగు నీరు అందించనున్నట్లు వేల్లడించారు. కరువు పరిస్థితులు ఏర్పడినా నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరం ఎండిపోకుండా సాగు నీరు అందించి రైతుల పంటలను కాపాడే బాధ్యత నాదని పేర్కొన్నారు. తీగారం గ్రామంపై నాకు ప్రత్యేక ప్రేమ ఉందని గ్రామంలో సిసి రోడ్లు, కమ్యూనిటీ హల్లు, రోడ్లకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తీగారం గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కుండ నిండా అన్నం ఉన్నప్పుడే కడుపు నిండా పెట్టగలమని కావున పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు స్వప్న బ్రహ్మారెడ్డి, సంధ్యారాణి రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ రాజ్, హౌసింగ్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
