Mulugu SP Gotti Koya Students
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు గోత్తికోయ గ్రామాన్ని అధికారులతో కలిసి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ గోత్తి కోయ పెద్దల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున పస్ర సర్కిల్ పరిధిలోని గుత్తి కోయ విద్యార్థులకు పస్ర సిఐ ఆధ్వర్యంలో స్కూలు బ్యాగ్ లు పంపిణీ చేశారు.ఈ గూడెం అటవీ శాఖ పరిధి లో ఉన్నందున పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేమని, రాకపోకలకు వీలుగా ఉండేలా మట్టి రోడ్డు వేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. వీలైనన్ని సోలార్ లైట్ లు ఏర్పాటు చేస్తామన్నారు. గుత్తి కోయలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వచ్చిన వారికి కులం సర్టిఫికెట్ లు జారీ చేసే అంశం తమ పరిధిలో లేదని, అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి, మంత్రి సీతక్క దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పారు. ములుగు లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నందున గోత్తి కోయ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు స్కూలు బ్యాగ్ లు పంపిణీ చేసి, అనంతరం యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.
పాఠశాల ఆవరణలో ఎస్పీ , డీఎస్పీ మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, పస్ర సిఐ దయాకర్,తాడ్వాయి ఎస్సై జగదీష్, పస్ర ఎస్సై తాజుద్దీన్, నార్లపూర్ ఎస్సై కమలాకర్ పాల్గొన్నారు.
