Sharada Assumes Charge Principal
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని జిఎంఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పెద్దపల్లి శారద బాధ్యతలు స్వీకరించారు. గతంలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన రాజిరెడ్డి మే నెలలో పదవి విరమణ చేయగా కమలాకర్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధితులు నిర్వహిస్తున్న పెద్దపల్లి శారద బదిలీపై స్టేషన్ ఘన్ పూర్ కు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాల సేవలను డివిజన్ పరిధిలోని ఆయా మండలాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్నత విద్యార్హతలు, అనుభవము కలిగిన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను అందిస్తామని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
