Rain Prayers Kamalapur Women
* వర్షాల కోసం గ్రామ దేవతలకు మహిళల జలాభిషేకం
ఆకేరు న్యూస్,కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామ మహిళలు వర్షాలు కురవాలంటూ గ్రామ బొడ్రాయికి జలాభిషేకం చేశారు. వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి చేరుకునేసరికి, చివరకు ఆ దైవమే దిక్కంటూ గ్రామస్తులు భక్తిమార్గం పట్టారు. గ్రామంలోని బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లి ఆలయాలతో పాటు హనుమాన్ గుడిలో గ్రామ మహిళలంతా ఏకమై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయాన్నే సాంప్రదాయబద్ధంగా ఇళ్ల నుండి బిందెలతో నీళ్లు తెచ్చి, గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో జలాభిషేకం చేశారు. దేవతామూర్తులకు పసుపు, కుంకుమలు సమర్పించి, గ్రామానికి కరువు కాటకాలు రాకుండా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో నాగుర్ల సమ్మక్క, మిట్టపల్లి బతుకమ్మ, సురావు వనమాల, ఒగ్గోజు పద్మ, కందుర్ల అరుణ, సురావు సునీత, కందుర్ల లలిత, గోడి శాల సమ్మక్క, మిట్టపల్లి బతుకమ్మ సాంబయ్య, గువ్వాడి కమల, నాగుర్ల దేవేంద్ర, గుండెబోయిన రాజమ్మ, సముద్రాల మంజుల, మిట్టపల్లి సుధవానీ, శిరీష, రజిత, మర్రిపెల్లి ముత్తక్క ,పోతుగంటి రమ, దాపిక సుజాత ,ఇజ్జగిరి దేవేంద్ర ,తుమికి కరుణ, గువ్వాడి కమల ,సముద్రాల మంజుల పాల్గొని, వానలు కురవాలని ప్రార్థించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
