DGP CV Anand Karreguttalu Development
* నాడు భద్రతా బలగాలగాలకు సవాల్
* నేడు టూరిజం స్పాట్
ఆకేరు న్యూస్, ములుగు : ఒకప్పుడు భద్రతా బలగాలకే సవాల్‌గా మారిన ఈ ప్రాంతంలో ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది.మావోయిస్టుల ప్రాబల్యంతో ఉద్రిక్త ప్రాంతంగా పేరుగాంచిన ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలంలోని కర్రెగుట్టల్లో సరికొత్త శకం మొదలైంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కర్రెగుట్టలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు బలగాలు ఆయనకు ఘనంగా గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించాయి. అనంతరం డీజీపీ స్వయంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో భాగంగా పోలీసు అధికారులు ఆకాశంలోకి బెలూన్లు, శాంతి కపోతాలను (పావురాలను) ఎగురవేశారు.
* నాడు భద్రతా బలగాలకు సవాల్
సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల్లో భద్రతా బలగాల పట్టు బిగించడంతో క్రమంగా తీవ్రవాద ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా ప్రశాంత వాతావరణంలోకి తీసుకువచ్చి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కర్రెగుట్టల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రానున్నాయి. ఈ నిధులతో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి, పర్యాటకులను ఆకర్షించేలా తగిన చర్యలు తీసుకోనున్నారు.ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొన్న కర్రెగుట్టలు నేడు జాతీయ జెండా ఆవిష్కరణతో శాంతిభద్రతలకు, అభివృద్ధికి చిరునామాగా మారుతుండటంతో స్థానికులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
———————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
