Old City Comes Alive as Bonalu Celebrations and Ghatam Procession
* అంగరంగ వైభవంగా బోనాల జాతర
* ఘనంగా అంబారీపై అమ్మవారి ఊరేగింపు
* అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
అశేష భక్తజనంతో పాతబస్తీ కిక్కిరిసిపోయింది. శివసత్తుల పూనకాలతో ఊగిపోయింది. పోతరాజుల విన్యాసాలతో అలరించింది. పోతారాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య ఓల్డ్‌సిటీలో ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవాలను ప్రారంభించారు.
* అంబారీపై అమ్మవారు
బోనాల సంబురం పాతబస్తీలో సోమవారం సాయంత్రం అంబరాన్ని తాకింది. అక్కన మాదన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఘటం అంబారీ యాత్ర ఘనంగా సాగింది. ఆలయం నుంచి చార్మినార్‌కు సాయంత్రం 7.20 గంటలకు చేరుకుంది. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఘటానికి స్వాగతం పలికింది. పాతబస్తీ నుంచి వివిధ దేవాలయాల నుండి అమ్మవారి ఘటాలు చార్మినార్ మీదుగా ముందుకు సాగాయి. మహాకాళేశ్వర ఆలయం ఆధ్వర్యంలో సుమారు 20 వాహనాల్లో వివిధ దేవుళ్ళ రూపాలు దేశభక్తి ప్రదర్శించిన శకటాలు భక్తులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి
* భారీ బందోబస్తు
ఓల్డ్‌సిటీ బోనాలు, ఘటాల ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. అణువణువూ క్షుణ్నంగా పరిశీలించారు. చార్మినార్ వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీఏ ర్పాటు చేసిన వేదిక నుంచి పలువురు దేవాలయాల కమిటీ ప్రతినిధులు మాట్లాడారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
