Political War of Words Erupts in Kamalapur between ministers ponguleti, ponnam and padi kaushik
* ఎవరు కట్టిన అది ప్రభుత్వ సొమ్మే
* గతంలో రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా అనే చర్చ అనవసరం
* ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళలో ఆనందమే ముఖ్యం
* మంత్రులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణమైన 2BHK ఇండ్లను మేము ముట్టుకోమనకుండా పేదవారికి అందించడం ముఖ్యమైందని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కమలాపూర్ లో జరిగిన ఇందిరమ్మ ఇల్లు 2BHK పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ…. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అలా అనుకుంటే కమలాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఈటల కారకుడనీ అన్నారు. ఆ వెంటనే, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేచి నిలబడి బరాబర్ కేసీఆర్ కట్టిననే అంటున్న అని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కొద్దిసేపు వాగ్వాదం సద్దుమణిగాక, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కమలాపూర్ నియోజకవర్గాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
అనంతరం రెవెన్యూ , గృహ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కట్టిన అది ప్రభుత్వ సొమ్మేనని, వారు కట్టారు మేము పూర్తి చేయమనకుండా అర్హులైన ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళలో ఆనందం చూడటమే తమ ప్రజా ప్రభుత్వం లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం లాగా ముఖ్య నియోజకవర్గానికి కాకుండా ప్రతిపక్ష శాసనసభ్యులకు సైతం 3500 ఇండ్లను ఇచ్చామన్నారు. రెండో విడతలో మరో రెండువేల ఇండ్లను ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంలో ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయని కానీ గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కొల్లగొట్టిన కారణంగా అనుకున్నవన్నీ ఇంకా ఇవ్వలేదని తప్పకుండా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం, వేదిక పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చివరకు పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని పునరుద్ఘాటిస్తూ మంత్రి పొంగులేటి తన ప్రసంగాన్ని ముగించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
