Kamalapur Road Accident
* ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం పరకాల- హుజురాబాద్ ప్రధాన రహదారిపై హుజురాబాద్ కి వెళ్తున్న క్రెటా కారు ఉప్పల్ ఆర్వోబీ (ROB) సమీపంలో గల మూల మలుపు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకెళ్లింది.. ప్రమాద సమయంలో కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తుండగా… వారిలో కరీంనగర్‌కు చెందిన కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా , మరొకరు సుల్తానాబాద్‌కు చెందిన తూర్పాటి భార్గవ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి హనుమకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
