Anil Family Financial Assistance
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఇటీవల మృతి చెందిన జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ కు చెందిన గద్ద అనిల్ కుటుంబానికి గ్రామస్థులు, దాతల నుండి సేకరించిన రూ.35 వేల ఆర్థిక సహాయాన్ని గ్రామ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ చేతుల మీదుగా ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగమ్మ, వార్డు సభ్యులు, పిఏసిఎస్ డైరెక్టర్ గుగులోతు ఊమ్ల నాయక్, మాజీ సర్పంచ్ రుప్లా, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ వైస్ ఎంపీపీ సరిత నర్సింహ, డీలర్ ప్రతాప్ సింగ్, రవి, బాలరాజు, తిరుపతి, గుగులోతు మోహన్, గుగులోతు విజయ్, బాపు నాయక్, వినయ్ కుమార్, మోహన్ దాస్, బాలు, భాస్కర్, కృష్ణమూర్తి, కనకచారి, గోస్కుల సురేష్, ప్రతాప్, అనిల్, మోహన్, రాజయ్య ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.
