Women Financial Empowerment in Malkapur
* మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
-సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల తోడ్పడుతూ మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని మల్కాపూర్ సర్పంచ్ ఎడవల్లి లావణ్య మల్లారెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ మహిళా సంఘాల సర్వసభ్య సమావేశము మంగళవారం జరిగింది. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ పరిధిలోని గ్రామాల మహిళా సంఘాలు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని బ్యాంకుల ద్వారా పలు పథకాలను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. సమావేశంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కె వీరన్న, ఎపిఎమ్ నరేందర్, మేనజర్,ఎపిఎమ్, సీసీ శోభ, ఏ ఓ నరసింగరావు, ఉప సర్పంచ్ పసుల వెంకటేశ్వర్లు
వీఏఓలు రేణుక, షమ, కరుణ, తార, రజిత, మణి, మాధవి, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
