IBPS PO Recruitment 2026
* 6,716 PO పోస్టులకు నోటిఫికేషన్..
ఆకేరు న్యూస్, డెస్క్:
బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,716 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీ (MT), స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించింది.
నేటి (జూలై 1) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. జూలై 21 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
* ఎన్ని పోస్టులు?
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,716 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి 2027-28 రిక్రూట్మెంట్ సైకిల్‌కు సంబంధించిన ఖాళీలు.
* ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)
* మేనేజ్మెంట్ ట్రైనీ (MT)
* స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)
* స్పెషలిస్ట్ ఆఫీసర్ కింద ఉన్న పోస్టులు..
* ఐటీ ఆఫీసర్ (IT Officer)
* అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్
* రాజ్‌భాషా అధికారి
* లా ఆఫీసర్
* హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్
* మార్కెటింగ్ ఆఫీసర్
* అర్హతలు ఇవే..
అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
* ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ప్రారంభం: జూలై 1, 2026
చివరి తేదీ: జూలై 21, 2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 21, 2026
* PO, MT పరీక్షల షెడ్యూల్
ప్రిలిమ్స్ పరీక్ష: ఆగస్టు 2026
ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్/అక్టోబర్ 2026
మెయిన్స్ అడ్మిట్ కార్డు: అక్టోబర్ 2026
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 2026
పర్సనాలిటీ టెస్ట్: నవంబర్ 2026
ఇంటర్వ్యూలు: నవంబర్-డిసెంబర్ 2026
తుది కేటాయింపు: జనవరి 2027
* స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పరీక్షల షెడ్యూల్
ప్రిలిమ్స్ పరీక్ష: సెప్టెంబర్/అక్టోబర్ 2026
మెయిన్స్ పరీక్ష: నవంబర్ 2026
ఇంటర్వ్యూలు: నవంబర్-డిసెంబర్ 2026
తుది కేటాయింపు: జనవరి 2027
* ఎంపిక ఎలా ఉంటుంది?
PO, MT పోస్టులకు..
* ప్రిలిమినరీ పరీక్ష
* మెయిన్స్ పరీక్ష
* పర్సనాలిటీ టెస్ట్
* ఇంటర్వ్యూ
* తుది కేటాయింపు
SO పోస్టులకు..
* ప్రిలిమినరీ పరీక్ష
* మెయిన్స్ పరీక్ష
* ఇంటర్వ్యూ
* తుది కేటాయింపు
IBPS విడుదల చేసే పూర్తి నోటిఫికేషన్లో పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హతలు, పరీక్షా విధానం, సిలబస్, దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అప్లై చేసే ముందు అర్హతలు, నిబంధనలు పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలని IBPS సూచించింది.
APPLY LINK :
https://ibpsreg.ibps.in/crppoxvijun26/
