Hanumakonda Collector Meets Warangal CP N Swetha
ఆకేరు న్యూస్, హనుమకొండ:
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి శ్రీమతి ఎన్. శ్వేతను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్, నూతన సీపీకి పూలమొక్కను అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు ఉన్నతాధికారులు జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు, పరిపాలనాంశాలపై కాసేపు చర్చించారు.
* శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం..
ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సమన్వయంతో ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం, మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కలెక్టర్ అభినందనల పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తామని సీపీ పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
