Warangal Hanumakonda Electric Bus Services Suspended
* వరంగల్–హనుమకొండలో నేడు ఎలక్ట్రిక్ బస్సులు నిలిపివేత
ఆకేరు న్యూస్, హనుమకొండ : వరుసగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బస్సులను నిర్వహిస్తున్న JBM సంస్థ నుంచి సరైన వివరణ లేదా భద్రతా హామీ లభించకపోవడంతో, నేడు వరంగల్–హనుమకొండ బస్ స్టేషన్ల నుంచి ఎలక్ట్రిక్ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయనే అంశంపై అధికారిక ప్రకటన కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ నిలిపివేతపై అధికారుల నుంచి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
