Doddi Komaraiah Death Anniversary
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా సీపీఎం స్టేషన్ ఘన్ పూర్ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు ముఖ్య అతిథిగా పాల్గొనిరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. భూస్వామ్య, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతాంగం, పేద ప్రజల హక్కుల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. నేటి తరానికి దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి ఆదర్శంగా నిలవాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మునిగెల రమేష్ రజక వృత్తిదారుల జిల్లా అధ్యక్షుడు మైలారపు వెంకటేశ్వర్లు పార్టీ మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య, గట్ల మల్లారెడ్డి, యార మోహన్, మంద మహేందర్, చిలుముల్ల భాస్కర్, పోలాసు పరమేష్ నాయకులు కడుదుల నర్సిరెడ్డి, పిట్టల శ్రీను,గంగారపు మధుసూదన్, పైడిపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
