Aadharam Foundation Midday Meal Plate Distribution
* మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి చేసిన “ఆధారం ఫౌండేషన్”
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ ఉన్నత పాఠశాల విద్యార్థులకు “ఆధారం ఫౌండేషన్” ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి చేశారు.
పాఠశాలలో 6 నుండి 8వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఆధారం ఫౌండేషన్ హైదరాబాద్ సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ప్లేట్లను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. సంస్థ ప్రతినిధి లావణ్య జన్మదినం సందర్భంగా సుమారు రూ. 5 వేల విలువగల ప్లేట్లను గ్రామ సర్పంచ్ సుజన, పాఠశాల చైర్మన్ బేతి మంజుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. లావణ్య జన్మదినం సందర్భంగా పాఠశాల చైర్మన్ బేతి మంజుల విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ప్లేట్లను అందజేసిన ఆధారం ఫౌండేషన్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రుద్ర, లింగమూర్తి, రంజిత్ కుమార్, శ్రీనివాస్, రవీందర్, మురళి, అనసూయ, సలావుద్దీన్, పిడి గీరెడ్డి ప్రమోద్ రెడ్డి, సోమేశ్వరి, జగదీశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు.
