Mulugu Missing Mobiles Recovery
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న భాధితులు ఆన్లైన్ ( సిఈఐఆర్ పోర్టల్ ) లో ఫిర్యాదును నమోదు చేసుకున్న స్టేషన్ సిబ్బంది, ములుగు ఐ టీ కోర్ టీం సహాయంతో ఈ నెలలో మిస్సైన 15 మొబైల్ ఫోన్లను గుర్తించి, సోమవారం సుధీర్ రామ్నాథ్ కేకన్ చేతులమీదుగా బాధితులకు అందించారు.
* ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి మిస్సింగ్ మొబైల్స్ రికవరీపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
అంతేకాకుండా ప్రజలు తమ వ్యక్తిగత వస్తువుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని, మొబైల్ ఫోన్లు కోల్పోయిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేసుకోని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి రవీందర్, ములుగు ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
* పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందించిన ఎస్పీ.
ప్రస్తుత వర్షాకాలంలో పోలీసులు విధి నిర్వహణలో ఇబ్బంది పడకూడదని సోమవారం ములుగు జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించరాదని,విధి నిర్వహణలో ఏవైనా ఆటంకాలు, సమస్యలు ఎదురైనా వెంటనే పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చునని, తాను ఎల్లవేళలా క్రింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్ ఐ స్వామి తదితరులు పాల్గొన్నారు.
