Pawan Kalyan Emotional Tweet On Niranjan Death
ఆకేరు న్యూస్, హన్మకొండ : తనను ఎంతగానో అభిమానించే నిరంజన్ అనే యువకుడి అకాల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఇటీవల కాలంలోనే నిరంజన్ తనను కలిసిన క్షణాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తన కళ్లముందే సజీవంగా ఉన్నాయని, ఇంతలోనే అతడు ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి.. నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు నిరంజన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ… pic.twitter.com/uQ7ujh3La1
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2026
Please tell us what is wrong. Your report will be sent to the website team.
