SIR Voter Registration Drive
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఎస్ఐఆర్ ఓట్ల ప్రక్రియను పార్టీ ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ పార్టీ శ్రేణులను కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల పరిధిలోని పార్టీ బూత్ ఏజెంట్లతో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడారు. ఎన్నికల సంఘం చేపడుతున్న SIR (Special Intensive Revision) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పార్టీ బూత్ ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలిస్తూ, కొత్తగా అర్హత పొందిన యువత, మహిళలు మరియు ఇతర అర్హులందరి ఓటు నమోదు అయ్యేలా సహకరించాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఎవరికీ అన్యాయం జరగకుండా పార్టీ బూత్ ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో బూత్ ఏజెంట్లకు SIR ప్రక్రియపై అవసరమైన సూచనలు, అవగాహన కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను చర్చించి తగిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావేశంలో పార్టీ మండల కమిటీ సభ్యులు రంగరాయగూడం ఉపసర్పంచ్ మునిగే నరసింహులు మంద మహేందర్, కత్తుల రాజు, చిలుముల్ల భాస్కర్, నాయకులు వంగపండ్ల సోమయ్య బుత్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
