Kadiyam Srihari Birthday Speech
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 ఏళ్ళు పూర్తి చేసుకొని 75వ వసంతంలోకి అడుగు పెట్టాను నా పుట్టినరోజు సందర్బంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు అన్నారు.
నాకు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజల ఋణం తీర్చుకోలేనిది, నియోజకవర్గ ప్రజల మద్దతుతోనే సుదీర్ఘకాలంగా రాజకీయాలలో కొనసాగగలుగుతున్నాను అన్నారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసమే ఉపయోగించాను, ఏనాడూ అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా పని చేశాను అని స్పష్టం చేశారు. బాల కార్మికునిగా పని చెసి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఏదిగాను అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లతోనే ఈ స్థాయికి చేరుకోగాలిగాను అన్నారు. సామాన్య పేద కుటుంబంలో పుట్టి ఎన్నేళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నాను అంటే దానికి నా నిజాయితీనే కారణం, రాజకీయంగా నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
నేను పని చేసిన ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందరూ నన్ను గౌరవించారు అని వివరించారు. దేవాదుల ద్వారా రైతులకు సాగు నీరు అందించడం నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన అంశం,1994లోనే 100 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఉమ్మడి జిల్లాలో ప్రతీ గ్రామానికి బిటీ వేయడం రెండో అంశం అన్నారు. నియోజకవర్గం లోనే అత్యధిక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం,
యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసుకోబోతున్నాం అన్నారు. పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలని 100పడకల ఆసుపత్రి తీసుకువచ్చాను, ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, కెనాల్ సిసి లైనింగ్, దేవాదుల ఫెజ్ -3 పనులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఒకప్పుడు కరువు కాటకాలకు, వలసలకు కేంద్రం అయిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నేడు పసిడి పంటలకు నిలయంగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటైనా మున్సిపాలిటీలో 60 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నా మనీ 270 కోట్లతో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల అభివృద్ధి జరుగుతుందన్నారు.
హ్యామ్ ద్వారా నియోజకవర్గంలోని దాదాపు 40 ప్రధాన రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగనుంది అన్నారు. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనీ వివరించారు.
మంజూరు అయిన అభివృద్ధి పనులన్నింటిని ఏడాదిలో పూర్తి చేసి ప్రజల ముందు ఉంచుతాను అన్నారు. నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, ప్రజా సమస్యలను పరిష్కరించాడమే నాకున్న ఏకైక సంకల్పం పని స్పష్టం చేశారు.
