Telangana TET Results Released
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. జూన్ 16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
* ఫలితాల వివరాలు..
ఈ ఏడాది టెట్ పరీక్షల కోసం మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,15,028 మంది పరీక్షలకు హాజరయ్యారు. కాగా, ప్రకటించిన ఫలితాల ప్రకారం మొత్తం 50,544 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈసారి మొత్తం 43.94 శాతం మంది అభ్యర్థులు టెట్‌లో క్వాలిఫై అయ్యారు.
* నిరుద్యోగులకు, టీచర్లకు గుడ్ న్యూస్.. ఏడాదికి 4 టెట్ లు..
ఫలితాల విడుదల సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభ్యర్థులకు కీలక ప్రకటన చేశారు. ఇకపై నిరుద్యోగులకు, ఇన్ సర్వీస్ టీచర్లకు ఏడాదికి మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
“ఇకపై సంవత్సరంలో మొత్తం నాలుగు సార్లు టెట్ పరీక్షలను నిర్వహిస్తాం. ఇందులో ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు సార్లు, సాధారణ అభ్యర్థుల (నిరుద్యోగుల) కోసం రెండు సార్లు టెట్ పరీక్షలు ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు.
* ఈ నెల 21న కొత్త నోటిఫికేషన్….
ప్రస్తుత ఫలితాలు వచ్చిన వెంటనే మరో నోటిఫికేషన్‌కు విద్యాశాఖ సిద్ధమైంది. ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ఈ నెల 21వ తేదీన (జూన్ 21) కొత్త టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు, అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఫలితాలను అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
CHECK HERE :- https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx
Please tell us what is wrong. Your report will be sent to the website team.
