Telangana SIR Voter Revision
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
దేశ భవిష్యత్తు ఓటర్ల పై ఆధారపడి ఉందని మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ అన్నారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్, తిమ్మాపూర్, సూరారం గ్రామాలలో మంగళవారం (SIR) ఓట్ల సవరణ ప్రక్రియను క్లస్టర్ ఇంచార్జ్ మండల యాదగిరి హిమ్మత్ నగర్ సర్పంచ్ కడదూరి మమత సోమయ్య, తిమ్మాపూర్ సర్పంచ్ పులి సమ్మయ్య, సూరారం సర్పంచ్ మైదాస్ ప్రభాకర్ లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనం ఎన్నుకునే నాయకులు, ఏర్పరచుకునే ప్రభుత్వాలు ఓటరు అనుసరించే విధానాలపైనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని,
అంతటి వ్యక్తులను/ వ్యవస్థలను ఏర్పరిచే శక్తి బ్యాలెట్ బాక్స్ లో వేసే ఓటుకు మాత్రమే ఉందని అన్నారు. ప్రభుత్వాలను నిలబెట్టే, కూల్చివేసే
మహత్తర శక్తిని అందించే ఓటు విషయంలో జరుగుతున్న ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఈ SIR ప్రక్రియలో పాల్గొని, తమ ఓటును కాపాడుకోవడానికి వివరాలను సంబంధిత BLO లకు అందజేయాలని తెలియజేశారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు BLO లకు తోడుగా, BLAలు ఉండాలని, సూచించారు. ఎలాంటి పొరపాటు లేకుండా ఎన్యూమరేషన్ ఫారం నింపాలని, జాగ్రత్త లు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లతో పాటు, BLO లు, BLA లు, ఓటర్లు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
