Collector Chahat Bajpai, SIR Digitization drive
* డిజిటలైజేషన్లో జాప్యం వద్దు
ఆకేరు న్యూస్, హనుమకొండ:
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు.
మంగళవారం దీన్‌దయాళ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన కలెక్టర్, ఫారాల స్వీకరణ, నమోదు, డిజిటలైజేషన్ పనులను సమీక్షించారు.
* ఖచ్చితమైన నమోదు చేయాలి
కొత్త ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, చిరునామా మార్పులు తదితర దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు.
* పెండింగ్ లేకుండా పూర్తి చేయండి
ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫారాలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు ప్రక్రియలు ఒకేసారి కొనసాగితేనే లక్ష్యాన్ని గడువులోగా చేరుకోవచ్చన్నారు.
* 100 శాతం లక్ష్యం
పరకాల నియోజకవర్గంలో డిజిటలైజేషన్ దాదాపు పూర్తైందని, హనుమకొండ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వచ్చే ఆదివారం నాటికి 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి నమోదు చేయాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్వోలకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. బీఎల్ఏలు కూడా సమన్వయంతో పనిచేసి ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
