SRR Foundation Financial Aid
ఆకేరు న్యూస్, రాయపర్తి :
మండలంలోని పలు గ్రామాలలో కష్టాల్లో ఉన్న నిరుపేద ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం వారికి ఆర్థిక సహాయం చేయటం పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిత్యకృత్యం
అనారోగ్యం కారణంగానో లేదా ఇతర కారణాల వల్లనో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి, వారికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ ఆ కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలైన బాధితులను స్వయంగా కలిసి, వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థికంగా సహాయం చేస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా కేవలం మానవత్వమే పరమావధిగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆయన ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆపదలో ఉన్న వారికి ‘మేమున్నాం’ అనే ధైర్యాన్ని ఇస్తూ, నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పరిపాటి శ్రీనివాస్ రెడ్డ నడుపుతున్న SRR ఫౌండేషన్ సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
”కష్టాల్లో ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్లి, వారి కన్నీళ్లు తుడవడంలోనే నిజమైన మానవత్వం అని నిరూపిస్తూ, నిరంతరం ప్రజా సేవలో తరిస్తున్న శ్రీ పరిపాటి శ్రీనివాస్ రెడ్డి సేవలు అనన్యసామాన్యం.
మండలంలోని మైలారం గ్రామానికి చెందిన చంద్రమ్మ తొర్రూరు హాస్పిటల్ లో చికిత్స కుంటున్న సందర్భంగా వారిని ఆస్పత్రిలో పరామర్శించి ంచి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసిన ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమం మండల పార్టీ నాయకులు లేతాకుల రంగారెడ్డి సంధి దేవేందర్ రెడ్డి, యాదవ రెడ్డి,సంకినేని ఎల్లస్వామి, పెందోట శివ, తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
