mla Yashaswini reddy Jangaon Congress Office Inauguration
* ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
* కార్యకర్తలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ధనవంతి
ఆకేరు న్యూస్,జనగామ:
జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లాకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ, యాదాద్రి దేవాలయ బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణ తో కలిసి ఈ నూతన కార్యాలయానికి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ… నూతన పార్టీ కార్యాలయం జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులందరికీ ఒక దేవాలయం లాంటిదని, పార్టీ బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
”పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు
జిల్లా అధ్యక్షురాలు లాకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తాము ముందుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి దేవాలయ బోర్డు సభ్యులు లక్ష్మీనారాయణతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
