Special Electoral Roll Revision
* ఐదు జిల్లాల కలెక్టర్ల సమావేశం
ఆకేరు న్యూస్, హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ–2026 (Special Intensive Revision–2026) కార్యక్రమం అమలుపై శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, తెలంగాణ రాష్ట్ర స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (SHAKTI) శాఖ కార్యదర్శి శ్రీమతి హరి చందన దాసరి, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ సమీక్షను చేపట్టారు.
ఉమ్మడి వరంగల్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమ పురోగతిని ఆమె జిల్లా వారీగా కూలంకషంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో తప్పులు లేని సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
* హాజరైన ఐదు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు..
ఈ ప్రతిష్టాత్మక ఉమ్మడి సమీక్షా సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి ప్రత్యేక్షంగా పాల్గొన్నారు.
వీరితో పాటు ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, ఎన్నికల విభాగ ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు (ROs), సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (AROs), ఎన్నికల విభాగ సిబ్బంది తదితరులు పాల్గొని, తమ తమ జిల్లాల్లో ఇప్పటివరకు జరిగిన ఓటరు జాబితా సవరణల ప్రగతి నివేదికలను ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్కు సమర్పించారు.
